సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలి

సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలి

  • కుడిమేత విశ్వనాథ్ రావు

జైనూర్, ఆంధ్రప్రభ:

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో కాగజ్‌నగర్ ఎక్స్‌ రోడ్‌లో నిర్వహించే బహిరంగ సభకు నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథ్ రావు కోరారు.

జన సమీకరణలో భాగంగా ఆదివారం జైనూర్ మండల కేంద్రంలో జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాల ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దండేపల్లి మాజీ జడ్పీటీసీ త్రిమూర్తితో కలిసి బహిరంగ సభకు జన సమీకరణపై దిశానిర్దేశం చేశారు.

బహిరంగ సభ ఇన్‌చార్జి, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ ఆదేశాల మేరకు మండలాల వారీగా సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహనాలు సమకూర్చే అంశంపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సభ విజయవంతం కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని విశ్వనాథ్ రావు కోరారు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రతి గ్రామ పంచాయతీకి బస్సులు పంపించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాల ముఖ్య నాయకులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply