TG TET 2026 | టెట్ షెడ్యూల్ విడుదల..

TG TET 2026 | టెట్ షెడ్యూల్ విడుదల..

  • జూన్ 16 నుంచి 22 వరకు పరీక్షలు!

ఆంధ్రప్రభ : తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ‘టీజీ టెట్ (TG TET) జూన్ 2026’ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షలను జూన్ 16 నుండి జూన్ 22 వరకు మొత్తం 10 సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహించనున్నారు. ఈ ఏడాది టెట్ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 28,149 మంది సర్వీస్‌లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండటం గమనార్హం.

పరీక్షలు ప్రతిరోజు రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9:00 గంటల నుండి 11:30 గంటల వరకు, రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు ఉంటుంది.

పరీక్షల పూర్తి షెడ్యూల్ వివరాలు..

  • జూన్ 16: రెండు షిఫ్టులలోనూ ‘పేపర్-1’ పరీక్ష జరుగుతుంది.
  • జూన్ 17: మొదటి షిఫ్ట్‌లో ‘పేపర్-1’, రెండవ షిఫ్ట్‌లో ‘పేపర్-2 (మేథ్స్ & సైన్స్)’ పరీక్షలు ఉంటాయి.
  • జూన్ 18: రెండు షిఫ్టులలోనూ ‘పేపర్-2 (మేథ్స్ & సైన్స్)’ పరీక్ష నిర్వహిస్తారు.
  • జూన్ 19: రెండు షిఫ్టులలోనూ ‘పేపర్-2 (సోషల్ స్టడీస్)’ పరీక్ష జరుగుతుంది.
  • జూన్ 22: మొదటి షిఫ్ట్‌లో ‘పేపర్-2 (మేథ్స్, సైన్స్ మరియు సోషల్ స్టడీస్)’ పరీక్ష, అలాగే రెండవ షిఫ్ట్‌లో హిందీ, కన్నడ, తమిళం, ఉర్దూ, మరాఠీ, సంస్కృతం మీడియంల ‘పేపర్-1’ పరీక్షలు జరుగుతాయి.

పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in ను సందర్శించవచ్చు. టెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. 1 నుండి 5 వ తరగతి వరకు బోధించడానికి ‘పేపర్-1’, 6 నుండి 8 వ తరగతి వరకు బోధించడానికి ‘పేపర్-2’ అర్హత సాధించాల్సి ఉంటుంది.

ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ ఎందుకు తప్పనిసరి?

ఐదేళ్ల కంటే తక్కువ సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులు మినహా, మిగిలిన ఇన్-సర్వీస్ టీచర్లందరూ తమ ఉద్యోగాలను నిలబెట్టుకోవడానికి నిర్దేశిత గడువులోగా టెట్ పాస్ కావడం తప్పనిసరి అని ఇటీవ‌ల‌ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అలాగే ఐదేళ్ల లోపు సర్వీస్ ఉన్నవారు ప్రమోషన్ల కోసం టెట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అయితే, ఇటీవల సుప్రీంకోర్టు ఈ గడువును మరో మూడేళ్లు పొడిగించింది. దీని ప్రకారం ఇన్-సర్వీస్ టీచర్లు ఆగస్టు 31, 2028 లోగా టెట్ పాస్ అవ్వడానికి సమయం లభించింది.

Leave a Reply