ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ..

ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ..
వికారాబాద్, ఆంధ్రప్రభ : వెంకటాపుర తండాలో ఆదివారం ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ నిర్వహించారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని వెంకటాపుర తండా 6వ వార్డులో ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులు M .అనిత W/o M.పరశురాం, P. రాధిక W/o P. సంతోష్ నివాస స్థలంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యులు నేనావత్ పరశురామ్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పరశురామ్ నాయక్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, కమిటీ సభ్యులుగా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తండా ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గరి వెంకటరెడ్డి, గోపాల్, నరేంధర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
