2Spiritual Texts | రెండు లక్షల గ్రంథాల ఆవిష్కరణ

2Spiritual Texts | రెండు లక్షల గ్రంథాల ఆవిష్కరణ
2Spiritual Texts | హైదరాబాద్ఆం ధ్రప్రభ : వేదవిదుల మంత్రోచ్ఛారణల మధ్య హైదరాబాద్లోని మైహోమ్ అవతార్ ప్రాంగణంలో శనివారం సాయంత్రం ఒక మహోజ్వల భక్తి ఘట్టం చోటుచేసుకుంది. ప్రముఖ రచయిత, శ్రీశైలం దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ రచించిన రెండు ఆధ్యాత్మిక గ్రంథాలు భారీ స్థాయిలో ఆవిష్కరించబడ్డాయి.

“విష్ణుం వందే” అనే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర గ్రంథం ఒక లక్ష ప్రతులు, “శివశ్శివమ్” అనే శివ స్తోత్ర కదంబం మరో లక్ష ప్రతులు కలిపి మొత్తం రెండు లక్షల ప్రతులను ఒకేసారి ఆవిష్కరించి భక్తులకు పంపిణీ చేశారు. వేలాది మంది భక్తులు, యువతీ యువకులు, మేధావులు, సాంస్కృతిక రంగ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో వేదపఠనం, భక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిర్వాహకులు జగన్మోహిని, జి. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. సంకటమోచన హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్ టి. అంజన్ కుమార్, సెక్రటరీ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పురాణపండ శ్రీనివాస్ రచనా వైభవాన్ని భక్తులు ప్రశంసించగా, సభ అనంతరం ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు భారీగా పోటీ నెలకొంది. ఈ రెండు లక్షల గ్రంథాల ఆవిష్కరణ కార్యక్రమం నగరంలో ఒక చారిత్రాత్మక భక్తి ఘట్టంగా నిలిచిందని నిర్వాహకులు పేర్కొన్నారు.


