Fire Accident | డెకరేషన్ గోదాంలో మంటలు..

Fire Accident | డెకరేషన్ గోదాంలో మంటలు..

Fire Accident |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పటాన్‌చెరు పట్టణ కేంద్రంలోని ఓ డెకరేషన్ సామాగ్రి గోదాంలో ఇవాళ అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. గోదాంలో నిల్వ ఉంచిన డెకరేషన్ సామాగ్రి కారణంగా మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

అగ్నిప్రమాదంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనలో ఎంత మేర నష్టం జరిగింది? ఎవరైనా గాయపడ్డారా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు, అగ్నిమాపక అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply