Talasani | రాష్ట్ర నినాదంగా.. కేసీఆర్‌ మళ్లీ రావాలి..

Talasani | రాష్ట్ర నినాదంగా.. కేసీఆర్‌ మళ్లీ రావాలి..

Talasani | ఆంధ్రప్రభ, హైదరాబాద్‌ : కేసీఆర్‌ మళ్లీ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని, రాష్ట్రం మొత్తం ఇదే నినాదం వినిపిస్తోందని మాజీమంత్రి, సనత్‌ నగర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ప్లోర్‌ లీడర్‌ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. ముషీరాబాద్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు.

ముఖ్యంగా ప్రజలకిచ్చిన హామీల అమలు గురించి ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి పండపెట్టి తొక్కుతాం, గోటీలు అడుతా అంటుండని, కాంగ్రెస్‌ నాయకులను ప్రజలు పండపెట్టి తొక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం లభిస్తుందని ఆయన కేడర్‌కు తేల్చి చెప్పారు. కేసీఆర్‌ అద్భుతమైన పదేళ్ల పాలన, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల గౌరవాన్ని పెంచిదని, గులాబీ జెండా శ్రీరామరక్షగా మారిందన్నారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమేనని, ధైెర్యంగా ఉండండని, పార్టీ అండగా ఉంటుందని గులాబీ శ్రేణులకు భరోసా కల్పించారు. నిత్యం ప్రజల మధ్య ఉండి, ప్రజా సమస్యలపై ముందుండి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply