Siddaramaiah | కర్ణాటక రాజకీయాలపై చర్చలు

Siddaramaiah | కర్ణాటక రాజకీయాలపై చర్చలు
Siddaramaiah | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిశారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, కొత్త కేబినెట్ కూర్పు, నాయకత్వ మార్పు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
రాజీనామా అనంతరం రాహుల్ గాంధీ ఆహ్వానం మేరకు ఢిల్లీ చేరుకున్న సిద్ధరామయ్య అల్పాహార సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను రాజ్యసభకు పంపించే ప్రతిపాదనపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం లేదని, ఎమ్మెల్యేగానే కొనసాగుతానని సిద్ధరామయ్య స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ సమావేశంలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య, కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సుర్జేవాలా పాల్గొన్నారు. భేటీ అనంతరం సూర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక రాజకీయ అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. కొత్త కేబినెట్ కూర్పు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు.
