దేవునిపై విశ్వాసానికి‌ ప్రతీక బక్రీద్..

దేవునిపై విశ్వాసానికి‌ ప్రతీక బక్రీద్..

  • వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎస్ఈసీ మెంబర్ డాక్టర్ మెహబూబ్ షేక్

విజయవాడ, ఆంధ్రప్రభ : దేవునిపై అచంచలమైన విశ్వాసానికి, త్యాగనిరతికి ప్రతీక బక్రీద్ పర్వదినం అని వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు , పార్టీ ఎస్ఈసీ మెంబర్ డాక్టర్ మెహబూబ్ షేక్ చెప్పారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం ప్రత్యేక నమాజ్ కార్యక్రమం నిర్వహించారు. ముస్లిం మతగురువు డాక్టర్ కాలేషావలి దైవ సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం డాక్టర్ మెహబూబ్ షేక్ మాట్లాడుతూ… అల్లాహ్ చూపిన మార్గం విశ్వమానవ సోదరభావాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరు ప్రేమ, త్యాగం, పరస్పర నమ్మకం, సాటి వారికి సాయం చేయడం, క్షమాగుణం వంటి మంచి లక్షణాలను కలిగి ఉండాలని అన్నారు. ముఖ్యంగా దేవునిపై అపార నమ్మకానికి, తనను నమ్మిన వారికి ఆ దేవుడు ఎప్పుడూ అండగా ఉంటారని చాటి చెప్పడమే బక్రీద్ అసలు సందేశమని వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ బక్రీద్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Leave a Reply