మెడ రమేష్ కుటుంబానికి జగన్ ఫోన్ పరామర్శ

మెడ రమేష్ కుటుంబానికి జగన్ ఫోన్ పరామర్శ
- వైసీపీ సీనియర్ నేత మృతిపై ప్రగాఢ సానుభూతి
- కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన మాజీ సీఎం
- రమేష్ సేవలను స్మరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఆంధ్రప్రభ, విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా రాజకీయ వర్గాల్లో విషాదాన్ని నింపిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీ స్వర్గీయ మెడ రమేష్ మృతిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెడ రమేష్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన జగన్, ఈ దుర్ఘటన ఎంతో బాధాకరమని పేర్కొంటూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు సమాచారం. స్వర్గీయ మెడ రమేష్ పార్టీ అభివృద్ధికి, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారానికి చేసిన సేవలను జగన్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రజలతో మమేకమై పనిచేసిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. మెడ రమేష్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ఈ లోటును భరించే మనోధైర్యం కలగాలని జగన్ ఆకాంక్షించారు.
