బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్

బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్

విజయవాడ, ఆంధ్రప్రభ : పవిత్ర బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగం, సేవాభావం, సోదరభావానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగ సమాజంలో ప్రేమ, శాంతి, ఐక్యతను మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు నిండాలని ప్రార్థించారు.
మత సామరస్యాన్ని కాపాడుతూ అందరూ కలిసి సంతోషంగా పండుగ జరుపుకోవాలని దేవినేని అవినాష్ కోరారు.
