మేడ రమేష్ మృతి వైసీపీకి తీరని లోటు

మేడ రమేష్ మృతి వైసీపీకి తీరని లోటు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరం
వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
ప్రభుత్వ ఆసుపత్రిలో భౌతికకాయానికి ఘన నివాళి
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన అవినాష్
విజయవాడ, ఆంధ్రప్రభ : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీ మేడ రమేష్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తుదిశ్వాస విడవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి నిబద్ధతతో సేవలందించిన నాయకుడిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న దేవినేని అవినాష్, మేడ రమేష్ భౌతికకాయానికి పూలమాల అర్పించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మేడ రమేష్ ప్రజా సమస్యలపై ఎప్పుడూ ముందుండే నాయకుడని, పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారని అవినాష్ గుర్తు చేశారు. ఆయన మరణం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. మృతుడి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
