స్కాలర్‌షిప్ దరఖాస్తుల గడువు పొడిగింపు..

భూపాలపల్లి, ఆంధ్రప్రభ: 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్ని కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, వికలాంగులు, మైనారిటీ విద్యార్థుల పోస్ట్‌-మెట్రిక్ స్కాలర్‌షిప్ ప్రెష్, రెన్యువల్ దరఖాస్తుల గడువును మే 31 వరకు పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఇ. ఇందిరా తెలిపారు.

ఏప్రిల్ మొదటి వారంలో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా పోస్ట్‌-మెట్రిక్ స్కాలర్‌షిప్ నమోదు చేసుకోలేకపోయిన అర్హులైన విద్యార్థులకు మరో అవకాశంగా ఈ గడువు పొడిగింపు కల్పించినట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్‌ల కోసం అర్హులైన విద్యార్థులు తెలంగాణ ఈ-పాస్ వెబ్‌సైట్‌లో తమ దరఖాస్తులను సమర్పించుకోవాలని సూచించారు.

ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువు తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఇ. ఇందిరా కోరారు.

Leave a Reply