డీజీపీతో భేటీ.. పోలీసింగ్పై కీలక సూచనలు

మోత్కూర్, ఆంధ్రప్రభ ; తెలంగాణ రాష్ట్ర డిజిపి గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ ను మంగళవారం హైదరాబాదులోని డిజిపి కార్యాలయంలో రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ సభ్యులు డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించి అభినందించారు .తెలంగాణ రాష్ట్రం లో సిసి ఫుటేజ్ ల నిర్వహణ, ఫ్రెండ్లీ పోలీసింగ్ తో శాంతి భద్రతలు అదుపులోకి రావడం అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా డా.వర్రె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం లో ఫ్రెండ్లీ పోలీసింగ్ తో శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ పోలీస్ వ్యవస్థ నెంబర్ వన్ గా నిలవడం హర్షణీయమన్నారు.రాష్ట్రంలోని అన్ని గ్రామాలు,పట్టణాల్లో నేరాల నియంత్రణ కోసం శాంతి కమిటీలను ఏర్పాటు చేసి, ఆయా కమిటీల ద్వారా నేరాలపై ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించాలని, నేరాలను అరికట్టే విధంగా పోలీస్ వ్యవస్థను తయారు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వర్రే వెంకటేశ్వర్లు డిజిపి ఆనంద్ ని కోరారు.
