మహిళల ఆర్థిక సాధికారతే గ్రామాభివృద్ధికి మూలం

మహిళల ఆర్థిక సాధికారతే గ్రామాభివృద్ధికి మూలం

  • పొట్లపల్లి శ్రీధర్ రావు

చిలుపూర్, ఆంధ్రప్రభ: మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబాలు బలపడతాయని చిలుపూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు అన్నారు.

చిలుపూర్ మండలం తీగల తండా గ్రామంలో మహిళా కమ్యూనిటీ భవన నిర్మాణానికి సోమవారం శ్రీ బుగులు వెంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహిళా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 200 గజాల స్థలాన్ని స్థానిక సర్పంచ్ తీగల సాంబరాజు విరాళంగా అందించారు.

గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం తరఫున మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అందించే నిధులతో పాటు గ్రామ సర్పంచ్ తన వంతు సహకారం అందిస్తూ అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కావడం స్పూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో మరిన్ని అభివృద్ధి నిధులు తీసుకువచ్చి చిలుపూర్ మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని శ్రీధర్ రావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ తీగల సాంబరాజు, ఉపసర్పంచ్ బాదావత్ తిరుపతి, మాజీ సర్పంచ్ మాలోతు ఠాగూర్, గ్రామైక్య సంఘ అధ్యక్షురాలు గద్ద మాధవి, సీసీ రజిని, వివోఏలు మంజుల, రమాదేవి, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply