Education Commissioner | ర్యాంక్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచన

Education Commissioner | ర్యాంక్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచన
Education Commissioner | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ పాలిసెట్-2026 ఫలితాలను శనివారం విడుదల చేశారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.
హైదరాబాద్‌లోని ఎస్‌వీ భవన్‌లో ఉన్న ఎస్‌బీటీఈటీ కార్యాలయం నుంచి టీజీ పాలిసెట్ ఫలితాలను ప్రకటించారు. ఇదే కార్యక్రమంలో ఎల్‌పీసెట్-2026 ఫలితాలను కూడా విడుదల చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
మే 13న రాష్ట్రవ్యాప్తంగా ఆఫ్‌లైన్ (ఓఎంఆర్ షీట్) విధానంలో ఈ పరీక్ష నిర్వహించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్ అంశాల నుంచి మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహించగా.. నెగిటివ్ మార్కింగ్ విధానం లేకపోవడం విశేషం.
విద్యార్థులు ముందుగా తమ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. అధికారిక టీజీ పాలిసెట్ వెబ్‌సైట్‌ను సందర్శించి.. ఫలితాలు లేదా ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం హాల్‌టికెట్ నంబర్, జన్మతేదీ నమోదు చేసి ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ మార్కుల ఆధారంగా తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్, టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
