మహిళలు, పిల్లల భద్రతపై సిఐ ప్రత్యేక అవగాహన సదస్సు

మహిళలు, పిల్లల భద్రతపై సిఐ ప్రత్యేక అవగాహన సదస్సు

పోక్సో, బాల్య వివాహాలు, మత్తు పదార్థాలపై గుడివాడలో చైతన్య కార్యక్రమం
మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు.. తల్లిదండ్రులకు పోలీసుల సూచనలు

గుడివాడ – ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాలు, గుడివాడ డీఎస్పీ పాల శ్రీనివాసరావు సూచనల మేరకు గుడివాడలో మహిళలు, బాలబాలికల రక్షణ, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధం, రోడ్డు భద్రత, మత్తు పదార్థాల వ్యతిరేకతపై శనివారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

గుడివాడ వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. శ్రీనివాస్, ఎస్సై కుమార్ రాజా, శక్తి టీం సభ్యులు, ఎన్‌టీఆర్ కాలనీ గ్రామ పెద్దలు, మహిళా మైత్రి సభ్యులు కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు, తల్లిదండ్రులకు పలు కీలక సూచనలు చేశారు.

పిల్లలపై వేధింపులు జరిగితే మౌనంగా ఉండకుండా వెంటనే తెలియజేయాలని, పోక్సో చట్టం ద్వారా లభించే రక్షణపై అవగాహన కల్పించారు. చిన్నారుల ఫోన్ వినియోగం, ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అలాగే మైనర్లు వాహనాలు నడపరాదని, తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని హెచ్చరించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, అలాంటి ఘటనలు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Leave a Reply