గుండ్లపల్లిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్..

గుండ్లపల్లిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్..
మూడు గడ్డిగాములు పూర్తిగా దహనం
నకరికల్లు, ఆంధ్రప్రభ:
నకరికల్లు మండల పరిధిలోని గుండ్లపల్లి గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామంలోని బిఎస్ఎన్ఎల్ టవర్ వద్ద ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో సమీపంలో ఉన్న మూడు గడ్డిగాములకు మంటలు అంటుకున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలు క్షణాల వ్యవధిలోనే గడ్డిగాములు అంతటా వ్యాపించాయి.
ఈ ప్రమాదంలో మూడు గడ్డిగాములు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. గడ్డిగాములు తగలబడిపోవడంతో పశుగ్రాసం లేక తాము తీవ్రంగా నష్టపోయామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆర్థికంగా ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
