china-strengthens-global-diplomatic-relations-xi-jinping I డ్రాగన్ దూకుడు!

china-strengthens-global-diplomatic-relations-xi-jinping I డ్రాగన్ దూకుడు!
china-strengthens-global-diplomatic-relations-xi-jinping I ప్రపంచ దేశాలతో చైనా దౌత్య బంధాలు బలోపేతం
భారత్-చైనా సంబంధాలకు 76 ఏళ్ల ప్రస్థానం
శత్రు దేశాలతోనూ మైత్రి పెంచుకుంటున్న డ్రాగన్
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా వ్యూహాత్మక అడుగులు
చైనాను సందర్శించిన అగ్రదేశాల నేతలు
త్వరలో చైనా పర్యటనకు పాకిస్తాన్ ప్రధాని
ఉత్తర కొరియా పర్యటనకు సిద్ధమవుతున్న షీ జిన్‌పింగ్
ప్రపంచ రాజకీయాల్లో పెరుగుతున్న చైనా ప్రభావం
china-strengthens-global-diplomatic-relations-xi-jinping ఆంధ్రప్రభ వెబ్ , అంతర్జాతీయం : అగ్రరాజ్య అధినేత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవిలోకి వచ్చిన తర్వాత విదేశీ విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అగ్రరాజ్య ఆధిపత్యం.. నోబుల్ శాంతి బహుమతి పొందేందుకు వేసిన ఎత్తుగడలు బెడిసి కొడుతున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలకు అమెరికా కారణమైన సంగతి వేరేగా చెప్పనవసరం లేదు. పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య ప్రపంచంలో అనేక దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి.. ఇంకా చితికి పోతున్నాయి..
అభివృద్ధి చెందిన దేశాలు, వర్థమాన దేశాలు తన పంథా మార్చుకుని ప్రస్తుత సంక్షోభం నుంచి బయట పడటానికి దౌత్య సంబంధాలు మెరుగుపర్చుకుంటున్నాయి. ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్ ఉన్న చైనా విదేశీ విధానం తో ఆ దేశం 185 దేశాలతో దౌత్య సంబంధాలను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా తన ఆర్థిక, భౌగోళిక రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు చైనా చురుకైన విదేశాంగ విధానాన్ని అనుసరిస్తున్నది.

china-strengthens-global-diplomatic-relations-xi-jinping పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో…
ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్ ఉన్న చైనాతో దౌత్య సంబంధాలకు బ్రేక్ అప్ ఇవ్వవు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా చైనా వస్తువులపై టారిఫ్ అధిక స్థాయిలో వేయడంతో ఆ రెండు దేశాల మధ్య శత్రుత్వం పెరిగింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ప్రపంచంలోని అన్ని దేశాల వలే చైనా కూడా ఆయిల్ సంక్షోభం ఎదుర్కొంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గలు కూడా అన్వేషిస్తున్న తరుణంలో చైనా పర్యటనకు వివిధ దేశ అధినేతలు మొగ్గు చూపారు. తొలుత ఆఫ్రికా అధ్యక్షుడు చైనాలో పర్యటించారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటించారు. మరి కొద్ది రోజుల్లో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ పర్యటించనున్నారు.

china-strengthens-global-diplomatic-relations-xi-jinping అగ్రరాజ్యాధినేతల ఫిదా
చైనాలో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫిదా అయ్యారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇచ్చిన ఆతిథ్యం, ప్రశాంతంగా జరిగిన శిఖరాగ్ర సమావేశాలు ప్రపంచ దేశాలను ఆకట్టుకున్నాయి.
చైనా, అమెరికా మధ్య ఎలాంటి ఒప్పందాలు లేనప్పటికీ కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం వచ్చింది. అందులో భాగంగా తైవాన్ విషయం ప్రస్తావించవచ్చు. చైనా పర్యాటన ముగించుకుని అమెరికా వెళ్లిన ట్రంప్ తైవాన్ విషయంలో ఓ క్లారిటీ ఇచ్చారు. తైవాన్‌కు ఆదుకోవడం కష్టమని ప్రకటించారు. రష్యా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. మరికొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం కూడా వచ్చాయి.

china-strengthens-global-diplomatic-relations-xi-jinping ఉత్తరకొరియా పర్యటించనున్న చైనా అధ్యక్షుడు
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చే వారంలోనే ఉత్తర కొరియాను సందర్శించే అవకాశం ఉంది. అమెరికా, రష్యా అధ్యక్షుల బీజింగ్ పర్యటనల వెంటనే ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ఈ పర్యటన గత నెలలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్యాంగ్యాంగ్ పర్యటన అనంతరం జరగనుంది. దీంతో రెండు దేశాల మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న సంబంధాలు మరింత బలపడుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉత్తర కొరియా , చైనా వాణిజ్య ఒప్పందాలతోపాటు ఉత్తర కొరియా, అమెరికా మధ్య సంబంధాలను మెరుగుపరచడంలో మధ్యవర్తిత్వం చేయాలనే ఉద్దేశంతో కూడా షీ ఈ పర్యటన చేయవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
కొరియా ద్వీపకల్ప అణ్వాయుధ పరీక్షల నేపథ్యంలో ఈ పర్యటనకు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌తో జరిగిన సమావేశంలో, “అస్థిరమైన అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో” రెండు దేశాలు తమ భద్రతా మరియు అభివృద్ధి ప్రయోజనాలను కాపాడుకోవాలని, ప్రపంచ అంశాలపై సమన్వయాన్ని బలోపేతం చేయడం కూడా ఒక ప్రధాన ఉద్దేశమని పరిశీలకులు భావిస్తున్నారు. 2019 తర్వాత చైనా నాయకుడిగా ఆయనకు ఇది రెండో పర్యటన అవుతుంది.

china-strengthens-global-diplomatic-relations-xi-jinping చైనాలో తర్వలో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ పర్యటన
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ వారాంతంలో చైనాకు వెళ్లి అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చలు జరపనున్నారు. ఈ చర్చల్లో ఇరాన్ యుద్ధం అంశం ప్రస్తావనకు వస్తుందా లేదా అన్నది వెల్లడించలేదు. “చైనా , పాకిస్థాన్ నాయకులు ద్వైపాక్షిక సంబంధాలు పరస్పర ఆసక్తి గల అంశాలపై లోతైన అభిప్రాయ మార్పిడి జరుపుతారు” అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ తెలిపారు. ఈ పర్యటన శనివారం నుంచి మంగళవారం వరకు కొనసాగుతుంది.

china-strengthens-global-diplomatic-relations-xi-jinping 76 ఏళ్లుగా కొనసాగుతున్న ఇండియా-చైనా దౌత్యం
1950 ఏప్రిల్ 1న, భారతదేశం, చైనా అధికారికంగా దౌత్య సంబంధాలను ప్రారంభించాయి. అప్పట్లో ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక ప్రధాన సంఘటన. చైనాతో దౌత్య సంబంధాలను స్థాపించిన మొదటి సామ్యవాదయేతర దేశం భారతదేశం కావడం విశేషం.
ఈశాన్య రాష్ట్రాల సరిహద్దులో ఉద్రిక్తతల మినహా భారత్- చైనా దౌత్య సంబంధాలు 76 ఏళ్లు కొనసాగింది.. ఇంకా కొనసాగుతునే ఉంది. 1954లో, ఈ రెండు దేశాలు సంయుక్తంగా ప్రపంచ ప్రసిద్ధ శాంతియుత సహజీవన పంచ సూత్రాలను ప్రతిపాదించాయి. ఇది భారతదేశం-చైనా సంబంధానికి కొత్త పునాది వేసి, రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సహకారంలో మొదటి శిఖరాగ్రానికి నాంది పలికింది. 1954 జూన్‌లో చైనా ప్రధాని జౌ ఎన్‌లై భారతదేశాన్ని పర్యటించారు. అదే ఏడాది అక్టోబర్‌లో, భారత ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ చైనాను సందర్శించారు.
china-strengthens-global-diplomatic-relations-xi-jinping 1962 నాటి సరిహద్దు సంఘర్షణ ప్రభావం ఇరు దేశాల మధ్య సంబంధాలపై తీవ్రంగా పడింది. భారత్, చైనా దౌత్య సంబంధాలను తెంచుకోనప్పటికీ, ఇరు పక్షాలు తమ రాయబారులను ఉపసంహరించుకుని, కాన్సులేట్ జనరల్‌ను మూసివేశాయి. ఆర్థిక, సాంస్కృతిక, ప్రభుత్వేతర రంగాలతో సహా ఇరు దేశాల మధ్య అన్ని రకాల మార్పిడులు నిలిచిపోయాయి.
భారత్-చైనా సంబంధాలు సుదీర్ఘమైన, ఉద్రిక్తమైన కాలంలోకి ప్రవేశించాయి. 1976లో భారత్, చైనా రాయబారుల మార్పిడిని పునఃప్రారంభించాయి. 1977లో ఇరు దేశాలు ప్రత్యక్ష వాణిజ్యాన్ని, సిబ్బంది మార్పిడిని పునఃప్రారంభించాయి. 1979లో, అప్పటి భారత విదేశాంగ మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి చైనాలో పర్యటన చేశారు. ఇది రెండు దశాబ్దాల తర్వాత అత్యున్నత రాజకీయ స్థాయిలో సంబంధాల పునరుద్ధరణకు దారితీసింది. భారత్-చైనా సంబంధాల అభివృద్ధిలో సాధించిన అద్భుతమైన విజయాలను, మంచి పురోగతిని చూస్తున్నప్పటికీ, ఇరు దేశాల మధ్య సంబంధాలలో ఉన్న సమస్యలను, అడ్డంకులను విస్మరించలేము.
china-strengthens-global-diplomatic-relations-xi-jinping శత్రువులు మిత్రులయ్యారు…
చైనా-భారత మధ్య ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు విషయంలో ఎప్పటికప్పుడు ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. 1962 నాటి సరిహద్దు సంఘర్షణ ప్రభావం ఇరు దేశాల మధ్య సంబంధాలపై తీవ్రంగా పడింది. భారత్, చైనా దౌత్య సంబంధాలను తెంచుకోనప్పటికీ, ఇరు పక్షాలు తమ రాయబారులను ఉపసంహరించుకుని, కాన్సులేట్ జనరల్‌ను మూసివేశాయి.
అప్పట్లో చైనా, భారత్ మధ్య శత్రుత్వం పె రిగింది. 1976లో సరిహద్దు సమస్యల తప్ప మిగిలిన అన్ని దౌత్యం పరంగా పురోగతి సాధిస్తున్నాయి.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌లు పెంచడంతో అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం చోటు చేసుకుంది. చైనాకు శత్రుదేశంగా ఉండేది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటన తర్వతా కొంత సద్దుమణిగింది. తైవాన్ విషయంలో ట్రంప్ వెనుక్కు తగ్గడంతో ఇరు దేశాల మధ్య మిత్రత్వం పెరిగింది.
ALSO READ : సీజేపీ.. సరికొత్త డిజిటల్ విప్లవం
