షార్ట్ సర్క్యూట్ తో వ్యవసాయ సామగ్రి దగ్ధం

నెన్నెల, ఆంధ్రప్రభ ; నెన్నెల మండలంలోని మైలారం గ్రామానికి చెందిన బొమ్మన మురళీధర్ గౌడ్‌కు చెందిన వ్యవసాయ కొట్టం కరెంట్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో 60 పిక్లర్ పైపులు, 700 మీటర్ల త్రీ-ఫేజ్ వైర్, రెండు స్టార్టర్లు, బోరు చుట్టూ ఉన్న పించింగ్ కోయలు తదితర వ్యవసాయ సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.3.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. అధికారులు స్పందించి బాధిత రైతుకు నష్టపరిహారం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
