తండ్రికి తగ్గ తనయుడు

తండ్రికి తగ్గ తనయుడు
- మాట ఇస్తే చాలు… సమస్యకు పరిష్కారం వచ్చినట్టే
- పశ్చిమ నియోజకవర్గం చాత్తాద వైష్ణవుల కోసం ప్రత్యేక ‘ప్రజా దర్బార్’
- యువతకు ఆదర్శరంగా నిలుస్తున్న కేశినేని వెంకట్
ఆంధ్రప్రభ, భవానిపురం:
రాజకీయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటంలో కేశినేని వెంకట్ తండ్రికి తగ్గ తనయుడిగా నిలిచారు. ఒకసారి మాట ఇస్తే ఆ సమస్య తీరేవరకు బాధ్యతగా నిలబడతారని ఆయన మరోసారి నిరూపించారు.కృష్ణ ఘాట్ విజయవాడ పశ్చిమ లో జరిగిన జల హారతి కార్యక్రమంలో పాల్గొన్న కేశినేని వెంకట్ అక్కడ ఉన్న చాత్తాద శ్రీ వైష్ణవులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన కేశినేని వెంకట్, వారి సమస్యల పరిష్కారం కోసం విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని)తో మాట్లాడి, ప్రత్యేకంగా ఒక ‘ప్రజా దర్బార్’ ఏర్పాటు చేస్తానని అక్కడికక్కడే హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ, శుక్రవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఐటీడీపి సభ్యులు చాత్తాద శ్రీ వైష్ణవుల కోసం ప్రత్యేక ప్రజా దర్బార్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఐటీడీపి అధ్యక్షుడు చైతన్య మధురంతకం ఐటీడీపి ప్రతినిధులు కే స్రవంత, ఫక్రుద్దీన్, కామాక్షి, దుర్గారావు బాధితుల సమస్యలను కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆ సమస్యలన్నింటినీ ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్ చేసి నమోదు చేశారు. ఈ సమస్యలను ఎంపీ కేశినేని చిన్ని దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా శాశ్వత పరిష్కారం లభించేలా చూస్తామని ఐటీడీపి సభ్యులు భరోసా ఇచ్చారు. తమ సమస్యలపై తక్షణమే స్పందించి, ఇచ్చిన మాట ప్రకారం ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం పట్ల చాత్తాద శ్రీ వైష్ణవ సంఘ ప్రతినిధులు మధురంతకం శ్రీనివాసరావు ఎంపీ కేశినేని చిన్ని కి కేశినేని వెంకట్ కు మరియు ఐటీడీపి బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
