Heatwave Delhi : అయ్యో.. చేపలూ..! Andhra Prabha Top News

Heatwave Delhi : అయ్యో.. చేపలూ..! Andhra Prabha Top News
- హీట్‌వేవ్‌తో అడుగంటిన సరస్సు నీటి మట్టం
- ఆక్సిజన్ తగ్గిపోవడంతో విలవిల్లాడిన చేపలు
- 46 డిగ్రీల వేడితో ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్
- నీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ప్రభావం
- గాంబూసియా, తిలాపియా, కార్ప్ చేపల భారీ మృతి
- సరస్సు నుంచి వస్తోన్న దుర్వాసన
- మృత చేపల తొలగింపులో ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ
ఆంధ్రప్రభ, ఢిల్లీ ప్రతినిధి

Heatwave Delhi : తూర్పు ఢిల్లీలోని త్రిలోక్‌పురిలోని సంజయ్ సరస్సు (Sanjay Lake) లో పెద్ద సంఖ్యలో చేపలు మృతి చెందాయి. హీట్‌వేవ్), సరస్సులో నీటి మట్టం అడుగంటిన స్థితిలో… మరో వైపు భీకర హీట్ వేవ్ తో ఆ సరస్సులో చేపలు విలవిల్లాడాయి. మలమల మాడిపోయాయి. సరస్సు నీటిలో ఆక్సిజన్ స్థాయి క్షీణించడంతో ఈ విషాదకర చోటు చేసుకుంది. కొండ్లి మురుగునీటి శుద్ధి ప్లాంట్ ప్రధాన పైప్‌లైన్ లీకేజీల కారణంగా గత కొన్నాళ్లుగా మరమ్మతుల్లో ఉంది.

సరస్సులోకి నీటి సరఫరా నిలిచిపోయింది, క్రమేపీ నీటి మట్టం వేగంగా పడిపోయింది. సరస్సు అడుగంటిన కొన్ని ప్రాంతాల్లో బీటలు వారింది. . ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దాదాపు 46°C కి చేరటంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఈ విపరీత హీట్ వేవ్‌తో నీరు కూడా ఆవిరి కాగ.. మిగలిన నీరు సలసల కాగిపోతోంది. నీటి మట్టం తగ్గడం వేడి పెరగడం తో నీటిలో ఆక్సిజన్ స్థాయిలు వేగంగా పడిపోయాయి. దీనికి తోడు నీరు తక్కువగా ఉండటంతో అందులోని కాలుష్య గాఢత పెరిగి, చేపలు ఊపిరాడక చనిపోయి నీటిపై తేలాయి.

ఈ సరస్సులో దోమల నివారణకు పెంచే చిన్న రకం గాంబూసియా చేపలతో పాటు, తిలాపియా , కార్ప్ వంటి మంచినీటి చేపలు భారీ పంఖ్యలో మృతి చెందాయి. ప్రస్తుతం సరస్సు నుంచి దుర్వాసన వస్తోంది . నీటి పై తతేలుతున్న చేపల్ని తొలగించే ప్రక్రియలో ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ నిమగ్నమైంది.
ALSO READ : Jangaon Fire : జనగామలో పరుశరామ ప్రీతి Andhra Prabha News
