IBC 2025 | కేటీఆర్ కు అరుదైన గౌరవం..

  • అమెరికా యూనివర్సిటీ నుంచి ప్రత్యేక ఆహ్వానం
  • ఐబీసీ సదస్సుకు ముఖ్య అతిథిగా

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. అమెరికా ఇల్లినాయిస్‌లోని ప్రతిష్టాత్మక నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ ఏడాది ఏప్రిల్ 19న జరగనున్న IBC 2025 కాన్ఫరెన్స్‌కు నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ కేటీఆర్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది.

తెలంగాణ పదేళ్ల పారిశ్రామిక ప్రగతి స్ఫూర్తిదాయకమని… హైదరాబాద్ ను ఉపాధి అవకాశాల గనిగా తీర్చిదిద్దారని కేటీఆర్ ను ప్రశంశించింది. పదేళ్ల పాలనలో తెలంగాణకు ప్రముఖ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో కేటీఆర్ కృషిని కొనియాడారు.

Leave a Reply