అమ్మవారికి బంగారు కానుక

అమ్మవారికి బంగారు కానుక

  • కనకదుర్గమ్మకు నల్లపూసల తాలి సమర్పణ
  • రూ.1.60 లక్షల విలువైన బంగారు ఆభరణం అందజేత
  • ఆలయ చైర్మన్ గాంధీకి అందజేసిన భక్తుడు

ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి:

విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి నంద్యాల జిల్లాకు చెందిన భక్తుడు విశేష భక్తిశ్రద్ధలతో బంగారు కానుకను సమర్పించారు. నందిపల్లి గ్రామానికి చెందిన వి. ఉభయ భాస్కర్ రెడ్డి అమ్మవారికి బంగారు నల్లపూసల తాలి ను కానుకగా అందజేశారు.

సమర్పించిన ఆభరణంలో రెండు గిన్నెలతో కూడిన నల్లపూసల తాలి ఉండగా, దాని బరువు 22 గ్రాములుగా అధికారులు వెల్లడించారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ బంగారు కానుక సుమారు రూ.1.60 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.

భక్తుడు సమర్పించిన ఈ పవిత్ర కానుకను ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) స్వీకరించారు. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అర్చక స్వాములు పాల్గొని, దాతకు అమ్మవారి ప్రత్యేక దర్శనాలు ఏర్పాటుచేసి, ఆశీర్వచనాలు, అమ్మవారి ప్రసాదం రసీదులను అందజేశారు.

Leave a Reply