సమగ్ర సర్వే నిధులు విడుదల చేయాలని వినతి..

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఎనిమిరేటర్ మరియు సూపర్వైజర్ లకు తక్షణమే నిధులు విడుదల చేసి వారి అకౌంట్లో జమా చేయాలని టి జీటీటిఎఫ్ ఆదిలాబాద్ జిల్లా జాదవ్ రవీందర్, టీ జి యు ఎస్ అధ్యక్షులు దినేష్ రాథోడ్ కోరారు వారు శుక్రవారం ఉట్నూర్ తాహసిల్దార్ రఘునాథ్ రావు కు కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు వారు తెలిపారు.

ఈ సందర్భంగా వారు ఇచ్చిన వినతి లో సర్వే చేసి నేటికీ 2 సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వం నేటికీ నిధులు విడుదల చేయకపోవడం శోచనీయమైన విషయం. సమగ్ర కుటుంబ సర్వే డబ్బులు తక్షణమే విడుదల చేయాలని టీజీటిటిఫ్ అదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జాదవ్ రవీందర్,టి జి యు ఎస్ అధ్యక్షుడు దినేష్ రాథోడ్ కోరారు. నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు జాదవ్ పవన్ లాల్. రాజేష్. అశోక్. శేషారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply