ఉపాధి హామీ కూలి మృతి…

ఉపాధి హామీ కూలి మృతి…

  • తీవ్ర విషాదంలో కుటుంబం..
  • జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించిన అధికారులు..

కొణిజర్ల, ఆంధ్రప్రభ ; మండల కేంద్రమైన కొనిజర్లకు చెందిన పాముల శ్రీను 55 ఉపాధి హామీ పథకానికి పని నిమిత్తం వెళ్లి మృతి చెందిన విషాద సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు అధికారుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన పాముల శ్రీను ఉదయం కొనిజర్ల తనికెళ్ల గ్రామాల మధ్య ఉన్న వాగు వద్దకు ఉపాధి హామీ పనులకు పని చేసేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఉదయం 6 గంటలకు పనికి వెళ్లగా కొంత సమయం పని చేసిన తర్వాత వడదెబ్బ తగిలి వాంతులు కావడంతో పని దగ్గరే కుప్పకూలి మృతి చెందాడు.

గమనించిన కూలీలు అధికారులకు సమాచారం అందించక సంఘటనకు చేరుకున్నటువంటి వారు వైద్య అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వైద్య సిబ్బందితో పాటు 108 బృందం పాముల శ్రీను ఆరోగ్య పరిస్థితి గమనించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతి విషయాన్ని గమనించిన మండల తాసిల్దార్ ఎంపీడీవో గ్రామ సర్పంచ్ పుష్పావతి ఉపసర్పంచ్ మోష పలువురు నాయకులు జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉపాధి హామీ పథకానికి వెళ్లి పనులు చేసుకుంటే తప్ప పూట గడవని పరిస్థితిలో ఉన్న కుటుంబంలో ఉన్న పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో జిల్లా ఉన్నతాధికారులు ఆ కుటుంబానికి న్యాయం చేసి ఆదుకోవాలని పలు రాజకీయ పార్టీల నాయకులు దొండలపాటి రమేష్ ఎర్రబాబు సూరంపల్లి రామారావు స్వర్ణ రమేష్ తదితర నాయకులు విజ్ఞప్తి చేశారు. పాముల శ్రీను భౌతిక గాయాన్ని పలువురు నాయకులు సందర్శించారు.

Leave a Reply