Anxieties | నలుగురు మహిళల దుర్మరణం

Anxieties | నలుగురు మహిళల దుర్మరణం
Anxieties | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బీడీ ఆకులు కోసేందుకు అడవికి వెళ్లిన నలుగురు మహిళలపై పెద్దపులి దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.
గుంజేవాహి అటవీ ప్రాంతంలో మహిళలు బీడీ ఆకులు సేకరిస్తుండగా పెద్దపులి ఒక్కసారిగా వారిపై దాడి చేసినట్లు సమాచారం. ప్రమాదం తీవ్రతకు నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పులి కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
