తీవ్ర వేడిగాలుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తీవ్ర వేడిగాలుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- కలెక్టర్ కె. వెట్రిసెల్వి

ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ:
ఏలూరు జిల్లాలో రాగల రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 నుండి 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లాలో తీవ్ర వేడిగాలులు (వడగాల్పులు) వీచే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలందరూ తగిన జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఎండల తీవ్రత దృష్ట్యా బస్టాండ్లు, ప్రధాన మార్కెట్లు, ఆసుపత్రులు వంటి జనసంచారం ఎక్కువగా ఉండే కూడళ్ల వద్ద నిరంతరాయంగా మంచినీటి సౌకర్యం, శీతలీకరణ షెల్టర్లు, మరియు నీడ ఉండేలా తక్షణ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే, వడదెబ్బ మరియు వేడిగాలుల బాధితులకు తక్షణమే మెరుగైన చికిత్స అందించేందుకు వీలుగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులను సిద్ధం చేయాలని వైద్యాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply