రాఘవాపురంలో సినిమా షూటింగు షురూ
రాఘవాపురంలో సినిమా షూటింగు షురూ
ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం రాఘవాపురం గ్రామంలోని అన్నపూర్ణ సమేత స్వయంభు విశ్వేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో సంధ్య ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న రెండో సినిమా షూటింగ్ గురువారం ప్రారంభమైంది. చిత్ర దర్శకుడు టి రాము ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంధ్య ఫిలిమ్స్ బ్యానర్‌పై తన స్వీయ దర్శకత్వంలో విడుదలైన తొలి చిత్రం ‘గాలి’ ప్రేక్షకాదరణతో విజయవంతంగా 32వ రోజు కూడా థియేటర్లలో ప్రదర్శితమవుతోందని తెలిపారు.
‘గాలి’ సినిమా 25 రోజుల సక్సెస్ మీట్‌ను హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో సినీ రంగ ప్రముఖుల సమక్షంలో నిర్వహించామని, 50 రోజుల వేడుకలను చెన్నైలో నిర్వహించనున్నట్లు తెలిపారు. సంధ్య ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న రెండో చిత్రం పూర్తిస్థాయి వినోదాత్మక కామెడీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుందని రాము చెప్పారు. ప్రధాన పాత్రల్లో బివి సుబ్బారెడ్డి, రోజా రాణి,రాంప్రసాద్ గురజాడ, అంజలి,చిన్ని,శ్రీకాంత్,శిరీష్, సుందరమ్మ,సురభి శేషు కుమారి, సురభి వీణ నటిస్తున్నారని తెలిపారు.
