జిల్లా ప్రెసిడెంట్‌ను కలిసిన మండల అధ్యక్షులు

జిల్లా ప్రెసిడెంట్‌ను కలిసిన మండల అధ్యక్షులు
భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ:
డీసీసీ అధ్యక్షులు కాటిపల్లి నాగేష్ రెడ్డిని నిజామాబాద్‌లో భీమ్‌గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్ కలిశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవి ప్రకటించిన తరువాత మొదటిసారి డీసీసీ అధ్యక్షుడిని కలిసి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మల్లెల లక్ష్మణ్ మాట్లాడుతూ.. తనపై బాధ్యత మరింత పెరిగిందని, పార్టీ బలోపేతం కొరకు అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందేలా బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పనిచేస్తానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు భోజగౌడ్, కోనేరు బాలగంగాధర్, పర్శ విగ్నేష్, వన్నెల జనార్దన్ తదితరులు ఉన్నారు.
