From June1 | పెరిగిన కనీస వేతనాలు అమలు..

From June1 | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్ర కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో కనీస వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. కేబినెట్ సబ్‌కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణను మూడు జోన్లుగా విభజించి కొత్త వేతనాలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
పెంచిన కనీస వేతనాలు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని సీఎం తెలిపారు. కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
జోన్-1లో అన్‌స్కిల్డ్ కార్మికుల కనీస వేతనాన్ని రూ.12,750 నుంచి రూ.16 వేలకి పెంచినట్లు సీఎం వివరించారు. అలాగే సెమీస్కిల్డ్ కార్మికుల వేతనం రూ.13,592 నుంచి రూ.17 వేలకి, స్కిల్డ్ కార్మికుల వేతనం రూ.13,772 నుంచి రూ.18,500కి, హైస్కిల్డ్ కార్మికుల వేతనం రూ.14,607 నుంచి రూ.20 వేలకి పెంచినట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది.
