పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సైకిల్ యాత్ర..

యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పట్టణం నుంచి మూటకొండూరు మండలం వరకు సైకిల్ యాత్ర చేపట్టారు.
ఈ సందర్భంగా మూటకొండూరు మండలంలోని ప్రధాన సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మండల ప్రజా పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు.
