ఆడబిడ్డలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

ఆడబిడ్డలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
నర్సింహులపేట, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు అండగా నిలుస్తుందని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ అన్నారు.బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో రూ.60.06 లక్షల కళ్యాణ లక్ష్మి,సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రమేష్ బాబు,మండల పంచాయతీ అధికారి కిన్నెర యాకయ్య,శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ వేముల విజయపాల్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు జినుకల రమేష్,దాసరోజు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
