దళితుల సంక్షేమానికి గంట శంకరయ్య అలుపెరగని పోరాటం

దళితుల సంక్షేమానికి గంట శంకరయ్య అలుపెరగని పోరాటం
సంగారెడ్డి, ఆంధ్రప్రభ: ప్రముఖ దళిత నాయకుడు గంట శంకరయ్య 5వ వర్ధంతి సందర్భంగా బుధవారం గజ్వేల్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గంట శంకరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు మాట్లాడుతూ, గజ్వేల్‌లో అంబేద్కర్ సంఘాన్ని స్థాపించి సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తూ గ్రామ గ్రామాన తిరిగి దళితుల సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి గంట శంకరయ్య అని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం కోసం కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు అట్టుకూరి రాములు, ప్రధాన కార్యదర్శి మస్కూరి కిష్టయ్య, మన్నే కృష్ణ, బొల్లారం ఎల్లయ్య, పంబాల సత్యనారాయణ, పొట్ట యాదగిరి, మాచపురం బాల్ నర్సయ్య, మైస మల్లయ్య, తుమ్మ శ్రీనివాస్, బైరం శివకుమార్, మైస నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
