12 days | అంత్య పుష్కరాలు సర్వం సిద్ధం

12 days | అంత్య పుష్కరాలు సర్వం సిద్ధం
సుందరంగా ముస్తాబు అయిన కాళేశ్వరం
గోదావరి తీరాన ప్రత్యేక ఏర్పాట్లు
రేపటి నుంచి జూన్ 1వరకు పుష్కర మహోత్సవం
తొలిస్నానం ఆచరించనున్న కంచి కామకోటి పీఠాధిపతి
ఆ తర్వాత స్నానం ఆచరించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా
పుష్కరాలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
12 రోజులపాటు ప్రత్యేక హోమాలు, పూజలు
12 days | సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : సరస్వతి అంత్య పుష్కరాలకు అంతా సిద్ధమైంది.. కాళేశ్వరం త్రివేణ సంగమ తీరం ప్రస్తుతం ప్రయాగ్ రాజ్‌ను తలపిస్తోంది. 21వ తేదీ ఉదయం 5.43 నిమిషాలకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ తొలిస్నానం ఆచరించిన అనంతరం అంత్య పుష్కరాలు ఆరంభమవుతాయి.

రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తొలిరోజు పుష్కర స్నానం ఆచరిస్తారు. 12 రోజుల పాటు జరిగే అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సరస్వతి అంత్య పుష్కరాలకు సమయం ఆసనమైంది. మే నెల 21వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు 12 రోజుల పాటు జరుగనున్న అంత్య పుష్కరాలకు అదిరిపోయేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం కాలేశ్వరం త్రివేణి సంగమం సరస్వతి పుష్కరాల శోభతో కొత్తందాలతో ప్రయాగరాజ్‌ను తలపిస్తుంది. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచనల మేరకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

12 days | వీఐపీ ఘాట్ వద్ద ప్రత్యేక సెట్టింగ్స్..
గత ఏడాది సరస్వతి పుష్కరాలు జరిగాయి. తాజాగా అంత్య పుష్కరాలకు కాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీ నుండి సరస్వతి నది అంత్య పుష్కరాలు నిర్వహిస్తున్నారు.. అంత్య పుష్కరాల సందర్భంగా జ్ఞానసరస్వతి పుష్కర ఘాట్, వీఐపీ ఘాట్ వద్ద ప్రత్యేక సెట్టింగ్స్ చేశారు.. సౌండ్స్ అండ్ లైటింగ్, ప్రత్యేక డెకరేషన్ చేస్తున్నారు.. వీఐపీ భక్తుల కోసం 40 ఆధునిక గుడారాలతో టెంట్ సిటీ నిర్మించారు.
12 days | గవర్నర్, ముఖ్యమంత్రి రాక..
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తొలిరోజు పుష్కర స్నానం ఆచరించే సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంత్య పుష్కరాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు వస్తుండడంతో కొన్ని శాశ్వత నిర్మాణాలు చేస్తున్న అదికార యంత్రాంగం.. నవరత్న హారతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.
12 days | 12 రోజులపాటు ప్రత్యేక హోమాలు..
అంత్య పుష్కరాలు జరిగే 12 రోజులు వివిధ ప్రాంతాల నుంచి స్వామిజీలు, పీఠాదిపతులు రానున్నారు.. ప్రత్యేక హోమాలు ఉంటాయి. మొదటిరోజు 21వ తేదీ గురువారం రోజున మహా గణపతి హోమం ఉంటుంది.. 22వ తేదీన సుబ్రహ్మణ్య షాడాక్షరీ హోమం, 23వ తేదీన హయగ్రీవ హోమం, 24వ తేదీన నవగ్రహ హోమం, 25వ తేదీన మహా మృత్యుజయ హోమం, 26వ తేదీన దుర్గా సూక్త హోమం, 27వ తేదీన మహా సుదర్శన హోమం, 28వేద దక్షిణామూర్తి హోమం, 29వ తేదీన స్వయంవర పార్వతి హోమం, 30వ తేదీన ధన్వంతరి హోమం, 31వ మహారుద్ర హోమం, 01వ తేదీన లఘు చండీ మహా పూర్ణాహుతి ఉంటుంది.
CLICK HERE TO READ MORE : 162km | మంత్రి కిషన్ రెడ్డి చొరవతో ప్రాజెక్ట్ ముందుకు
