రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎంపీ

రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎంపీ
ఎల్కతుర్తి , ఆంధ్రప్రభ:
ఇటీవల ఎల్కతుర్తి కార్మెల్ స్కూల్ ముందు జరిగిన రోడ్డు ప్రమాద బాధితులను హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మంగళవారం పరామర్శించారు. స్కూల్ సమీపంలో అతివేగంగా వచ్చిన ఒక కారు ఢీకొట్టడంతో మండల మాజీ ఎంపీపీ తంగేడ శాలిని భర్త మహేందర్, మాజీ సర్పంచ్, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు గొల్లె మాధవి భర్త మహేందర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరి కాళ్లు విరిగిపోవడంతో స్థానిక ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది ఇటీవల డిశ్చార్జ్ అయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బాధితుల నివాసాలకు స్వయంగా వెళ్లారు. వారిని ఆత్మీయంగా పలకరించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును, ప్రస్తుతం అందుతున్న వైద్య సహాయం వివరాలను అడిగారు. బాధితులు ఇద్దరూ ధైర్యంగా ఉండాలని, త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు పిట్టల మహేందర్, సింగిల్ విండో చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, మాజీ మండల అధ్యక్షులు యేల్తూరి స్వామి పాల్గొన్నారు. వీరితో పాటు పోరెడ్డి రవీందర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షులు కడారి రాజు, సూరారం గ్రామ సర్పంచ్ భాషబోయిన నీలా కొమురయ్య యాదవ్, మాజీ సర్పంచులు కుర్ర సాంబమూర్తి గౌడ్, ఎర్రబెల్లి సంపత్ రావు హాజరయ్యారు. మాజీ ఎంపీటీసీ వేముల శ్రీనివాస్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు వేముల సమ్మయ్య, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మేకల సుదర్శన్, మేకల బాబురావు, పెండ్యాల సుదర్శన్, తక్కలపల్లి బాబురావు, ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు, అంజాద్, సల్పలా కుమారస్వామి, పాటి భగవాన్ గౌడ్ తదితర ముఖ్య నాయకులు ఈ పరామర్శలో బాధితులకు ధైర్యం చెప్పారు.
