లోకేష్ నాయకత్వం టీడీపీకి కొత్త దిశ..

లోకేష్ నాయకత్వం టీడీపీకి కొత్త దిశ..

జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సందర్భంగా అభినందనలు..
ఉండవల్లి నివాసంలో నారా లోకేష్‌ను కలిసిన నెట్టెం రఘురాం
కేడీసీసీ బ్యాంక్ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ.

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ను మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ మంగళవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగు దేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సందర్భంగా నారా లోకేష్‌కు నెట్టెం రఘురాం హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీని జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేస్తూ యువతకు స్ఫూర్తిదాయక నాయకుడిగా లోకేష్ ముందుకు సాగుతున్న తీరు ప్రశంసనీయమని పేర్కొన్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో యువశక్తికి నూతన దిశానిర్దేశం చేస్తూ ప్రజల ఆశయాలను కార్యరూపంలోకి తీసుకువెళ్తున్న ఆయన నాయకత్వం తెలుగుదేశం పార్టీకి మరింత బలాన్ని తీసుకువస్తోందని కొనియాడారు. అలాగే కేడీసీసీ బ్యాంక్ ద్వారా రైతులు, మహిళలు, చిన్న వ్యాపారవేత్తల సంక్షేమం కోసం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంస్థ ప్రగతి, ప్రజలకు అందిస్తున్న సేవల గురించి నెట్టెం రఘురాం మంత్రి లోకేష్‌కు వివరించారు. గ్రామీణ ఆర్థికాభివృద్ధి, ప్రజా సంక్షేమం దిశగా కేడీసీసీ బ్యాంక్ చేస్తున్న కృషిని నారా లోకేష్ అభినందించారు.

Leave a Reply