Rs.243 cr | ప్రభుత్వ సాయంపై గంగపుత్రుల హర్షం

Rs.243 cr | ప్రభుత్వ సాయంపై గంగపుత్రుల హర్షం
Rs.243 cr | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : కృష్ణానదిలో మత్స్యకారులు భారీ బోట్ల ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గంగపుత్రులు బోట్ల ప్రదర్శన చేస్తూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు తెలిపారు. వరుసగా రెండో ఏడాది ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద నిధులు విడుదల చేయడంపై మత్స్యకార కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి.

మత్స్యకారుల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని గంగపుత్రులు పేర్కొన్నారు. వేట నిషేధ సమయంలో జీవనోపాధి దెబ్బతినకుండా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయానికి కృతజ్ఞతగా కృష్ణానదిలో బోట్ల ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.
వేట నిషేధ సమయంలో ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. గత ఏడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్ల సాయం అందించగా.. ఈ ఏడాది 1,30,796 కుటుంబాలకు రూ.262 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో మత్స్యకార కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.


