కోడి పందాల మోజులో… కటకటాల పాలు

కోడి పందాల మోజులో… కటకటాల పాలు
- స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు
- .14 మందిని అరెస్టు
- పట్టుబడిన వారిలో సింగరేణి ఉద్యోగి
- కీలక సూత్రధార ప్రజా ప్రతినిధి కుమారుడు
- పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్ రెడ్డి
సుల్తానాబాద్, ఆంధ్రప్రభ : కోడి పందాల మోజులో పలువురు కటకటాల పాలయ్యారు. వ్యాపారులు, ఉద్యోగస్తులు సైతం కోడి పందాలలో పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని ఆశించి అత్యాశకు పోయి పోలీసులకు చిక్కి చివరకు కటకటాల పాలైన వైనం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలో చోటుచేసుకుంది. మంగళవారం పెద్దపల్లి డిసిపి భూక్య రామ్ రెడ్డి సుల్తానాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎలిగేడు మండలం శివ పల్లి గ్రామంలోనీ బోడ గుట్ట వద్ద రహస్యంగా నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరాలపై పెద్దపల్లి ఏసిపిగజ్జి కృష్ణ ఆధ్వర్యంలో సుల్తానాబాద్, పెద్దపల్లి సిఐలు రంజిత్ రావు, ప్రవీణ్ ల సారధ్యంలో పోలీసులు ఆకస్మిక మెరుపు దాడి నిర్వహించి 14 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
పట్టుబడిన వారిలో ఓ మాజీ పోలీస్,ప్రస్తుత సింగరేని ఉద్యోగి సైతం ఉన్నట్లు వివరించారు. కోడిపందాల ప్రధాన సూత్రధారి గా ప్రజా ప్రతినిధి కుమారుడు ఎలిగేడు మండలం శివ పల్లి గ్రామానికి చెందిన దుగ్యాల కార్తీక్ రావు తెలియజేశారు. పోలీసుల దాడుల్లో శివపల్లి గ్రామానికి చెందిన ఓజ్జ శంకర్, పొన్నాల రాజు, పెద్దపల్లికి చెందిన బత్తుల రాజు, మందమరి మండలం గుడిపల్లి కి చెందిన సల్లూరి పవన్, ఇందారం కు చెందిన గడ్డం రాజేష్, గోదావరిఖని కి చెందిన పొట్లపల్లి మనోహర్ ఎండి రహీం, ఇందారం కు చెందిన పెన్నా రవీందర్, వేల్పుల సతీష్, పెద్దపల్లికి చెందిన పులి నాగరాజు, రామగిరి కి చెందిన కొల్లూరి మహేష్, జైపూర్ మండలం టేకుమట్ల కు చెందిన ఎండి సమాధు, పెద్దపల్లికి చెందిన సింగారపు అఖిల్ వర్మ, లను అదుపులోకి తీసుకున్నామన్నారు.
వారి వద్ద నుండి 13 మొబైల్ ఫోన్స్, 40 వేల రూపాయల నగదు, 7 ద్విచక్ర వాహనాలు, ఒక ఎర్టిగా కారు, ఆరు పందెం కోళ్లను స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు, మరి కొంతమంది పరారీలో ఉన్నారన్నారు. ఈ సమావేశంలో సుల్తానాబాద్, ఎలిగేడు, జూలపల్లి, బసంత్ నగర్ ఎస్సైలు చంద్రకుమార్, మధుకర్, సన్నత్ రెడ్డి, శ్రీధర్, నరేష్, లతోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందిని అభినందిస్తూ రివార్డులు అందించనున్నట్లు డిసిపి తెలిపారు.
