నున్న నూతన సిఐగా మహమ్మద్ అలీ బాధ్యతల స్వీకరణ

నున్న నూతన సిఐగా మహమ్మద్ అలీ బాధ్యతల స్వీకరణ

అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం.
గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లపై ప్రత్యేక నిఘా
24/7 నిరంతర నిఘా

పాయకాపురం, ఆంధ్రప్రభ : నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా సరే సహించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని నూతన ఇన్స్పెక్టర్ మహమ్మద్ అలీ హెచ్చరించారు. సోమవారం ఆయన నున్న పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా అత్యంత బాధ్యతాయుతంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఐ మహమ్మద్ అలీ మీడియాతో మాట్లాడుతూ స్థానిక ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించినా, లేదా అలాంటి అసాంఘిక పనులను వెనక ఉండి ప్రోత్సహించినా సరే.. వారిపై తక్షణమే రౌడీ షీట్ ఓపెన్ చేసి జైలుకు పంపుతామని తేల్చి చెప్పారు.

ముఖ్యంగా యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి విక్రేతలు, వినియోగదారులతో పాటు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే బ్లేడ్ బ్యాచ్ సభ్యులపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని సీఐ తెలిపారు. నున్న పరిధిలోని ప్రజలు ఎవరైనా సరే తమ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు, బ్లేడ్ బ్యాచ్‌ల సంచారం లేదా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనించినా.. వెంటనే ఏమాత్రం భయపడకుండా పోలీసు స్టేషన్‌ నెంబర్ 9490619463కు సమాచారం అందించాలని సీఐ మహమ్మద్ అలీ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత రహస్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు.

Leave a Reply