vaibhav suryavamshi| అభిషేక్ రికార్డ్ బద్దలు కొట్టిన వైభవ్

అభిషేక్ రికార్డ్ బద్దలు కొట్టిన వైభవ్

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాట‌ర్‌ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించాడు. ఓ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. అతడు 12 మ్యాచుల్లో 43 సిక్స్‌లు బాదాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ ఇంకా రెండు లీగ్‌ మ్యాచులు ఆడాల్సిఉంది. దీంతో సిక్స్‌ల సంఖ్య అర్ధశతకం చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 3 సిక్స్‌లు బాదడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. తద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ రికార్డ్‌ను అధిగమించాడు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ రికార్డును వైభవ్‌ అధిగమించాడు. అభిషేక్ 2024 సీజన్‌లో 42 సిక్స్‌లు కొట్టాడు. ఇప్పటివరకు ఇదే అత్యధికం. తాజాగా వైభవ్‌ ఆ ఘనతను తుడిచిపెట్టేశాడు. మరోవైపు ఈ ఎడిషన్‌లోనూ అభిషేక్ 37 సిక్స్‌లు కొట్టాడు. సన్‌రైజర్స్‌ కూడా ఇంకా రెండు లీగ్‌ మ్యాచ్‌లు ఆడాల్సిఉంది. సిక్స్‌ల విషయంలో వీరిద్దరి మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది.

ఐపీఎల్ 2024 సీజన్‌లో అభిషేక్ శర్మ 42 సిక్స్‌లు బాదగా.. వైభవ్ సూర్యవంశీ తాజా సీజన్‌లో మొత్తం 43 సిక్స్‌లతో అతన్ని అధిగమించాడు. ఈ జాబితాలో వైభవ్(43), అభిషేక్ శర్మ(42) తర్వాత శ్రేయస్ అయ్యర్(39), విరాట్ కోహ్లీ (38), సూర్యకుమార్ యాదవ్(38) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

Leave a Reply