18th May 2026 | తిరుమల సమాచారం..

18th May 2026 | తిరుమల సమాచారం..

18th May 2026 | తిరుమల, ఆంధ్రప్రభ :

“ఓం నమో వేంకటేశాయ కామితార్థ ప్రదాయినే,

ప్రణతః క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః”

అర్థం:

కోరికలను తీర్చే, శరణాగతుల దుఃఖాలను తొలగించే

గోవిందుడైన వేంకటేశ్వరునికి నమస్కారం.

శ్రీవారి దర్శనం కోసం..

తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది. వేసవి సెలవులు, వారాంతం కారణంగా శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం తిరుమల క్షేత్రం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.

భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ..

టీటీడీ విడుదల చేసిన వివరాల ప్రకారం మే 17వ తేదీన మొత్తం 91,020 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 35,193 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన హుండీ కానుకల ద్వారా టీటీడీకి రూ.3.54 కోట్ల ఆదాయం లభించింది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో సర్వదర్శనం కోసం వచ్చిన వారికి సుమారు 18 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తులు దీర్ఘకాలం వేచి ఉండాల్సి వస్తోంది.

భక్తుల కోసం..

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. తాగునీరు, అన్నప్రసాదం, వైద్య సేవలు, భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశారు. క్యూలైన్లలో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు రద్దీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.

Leave a Reply