Top-4 | రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్!

Top-4 | రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్!
Top-4 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్సీ జన్‌లో భాగంగా నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ 62వ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్‌కు సొంత మైదానంలో ఈ సీజన్‌లో ఇదే చివరి మ్యాచ్. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఢిల్లీకి ఈ మ్యాచ్‌లో గెలుపు అత్యంత కీలకం. మరోవైపు పటిష్టమైన రాజస్థాన్ రాయల్స్ కూడా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టాప్-4 రేసులో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని చూస్తోంది. దీంతో ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
