ఎస్సీ కార్పొరేషన్ రుణాల అభ్యర్థుల ఎంపిక

ఎస్సీ కార్పొరేషన్ రుణాల అభ్యర్థుల ఎంపిక

నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : 2025-26 సంవత్సరమునకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ఋణాల కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శనివారం నల్లగొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేశారు. నల్లగొండ మండలం మొత్తం 233 మంది దరఖాస్తు చేసుకోగా 170 మంది వారి ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరైనట్టు ఎంపీడీవో యాకూబ్ నాయక్ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి డాక్టర్ జి రమేష్ , ఎంపీవో ఇస్మాయిల్, వివిధ బ్యాంక్ మేనేజర్లు, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply