19 May.. Puthin china tour ట్రంప్ వెళ్లారు… పుతిన్ వ‌స్తారు!

19 May.. Puthin china tour ట్రంప్ వెళ్లారు… పుతిన్ వ‌స్తారు!

మ‌రో మూడు రోజుల్లో పుతిన్ చైనా ప‌ర్య‌ట‌న‌
చైనా-ర‌ష్యా మ‌ధ్య మెరుగుప‌డ‌నున్న ద్వైపాక్షిక సంబంధాలు
వ‌రుసుగా చైనాను సంద‌ర్శిస్తున్న పాశ్చ‌త్య‌దేశ అధినేత‌లు

ఆయిల్‌, ఎల‌క్ట్రానిక్ వాణిజ్య ఒప్పందాల‌పై కీల‌క నిర్ణ‌యాలు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ (అంత‌ర్జాతీయం) : చైనాలో పాశ్చ‌త్య‌దేశ అధినేత‌లు ఒక‌రిత‌ర్వాత ఒక‌రు చైనాలో ప‌ర్య‌ట‌న‌కు సిద్ధప‌డుతున్నారు. చైనాలో ప‌ర్య‌ట‌న ముగించుకుని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ దేశానికి చేరుకున్న వెంట‌నే ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప‌ర్య‌ట‌న ఖ‌రారైంది. గ‌త ఏడాది డిసెంబ‌ర్ చివ‌ర‌లో ఫ్రెంచ్ అధ్య‌క్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప‌ర్య‌టించిన సంగ‌తి విదిత‌మే. ఆ త‌ర్వాత మూడు రోజుల క్రితం అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ప‌ర్య‌టించారు. మ‌రో మూడు రోజుల్లో ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప‌ర్య‌టించ‌నున్నారు. చైనా అధ్య‌క్షుడు షీ జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మే 19, 20 తేదీల మధ్య చైనాలో అధికారిక పర్యటన చేయనున్నారు. ఈ మేర‌కు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ రోజు ప్ర‌క‌టించింది. ఆ త‌ర్వాత పాకిస్తాన్ ప్ర‌ధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ప‌ర్య‌టించ‌నున్నారు. చైనాతో దౌత్య విధానంతోపాటు వాణిజ్య, పారిశ్రామిక ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుప‌ర్చుకోవ‌డానికి ఆయా దేశాలు సిద్ధ‌ప‌డుతున్నాయి.

చైనా-ర‌ష్యా మ‌ధ్య మెరుగుప‌డ‌నున్న ద్వైపాక్షిక సంబంధాలు
ప‌శ్చిమాసియా ఉద్రిక్త‌త‌ల న‌డుమ అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా ప‌ర్య‌ట‌న ఎంతో ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. చైనాలో ట్రంప్ ప‌ర్య‌ట‌న త‌ర్వాత ఇరాన్‌-ఇజ్రాయెల్‌-అమెరికా యుద్ధానికి ముగింపు దిశ‌గా వెళుతుంద‌ని ప్ర‌పంచ దేశాలు భావించాయి. అయితే ఇరాన్ ఊసే ఎత్త‌కుండా అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ త‌న ప‌ర్య‌ట‌న ముగించారు. తీరా ఇరాన్ ఆయిల్ కొనుగోలు విష‌యంలో ఎలాంటి ఆంక్ష‌లు త‌మ‌కు లేద‌ని ట్రంప్ స్ప‌ష్టం చేశారు. దీంతో ఇరాన్‌-అమెరికా మ‌ధ్య దౌత్యానికి చైనా పెద్ద పాత్ర పోషిస్తుంద‌ని భావించిన ప్ర‌పంచ దేశాల‌కు నిరాశే ఎదురైంది. మూడు రోజుల్లో చైనాలో ప‌ర్య‌టించ‌నున్న ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ద్వైపాక్షిక సంబంధాలు, కీల‌క‌మైన వాణిజ్య ఒప్పందాలు మాత్ర‌మే కుదుర్చుకునే అవ‌కాశం ఉంది. వారిద్ద‌రి మ‌ధ్య ప‌శ్చిమాసియా ఉద్రిక్త‌త‌లు త‌గ్గించే మార్గాలు మాత్రం అన్వేషించే అవ‌కాశాలు లేవ‌న్న‌ది ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.

చైనా, రష్యాకు అతిపెద్ద వాణిజ్య, ఆర్థిక భాగస్వామి…
నూతన శకం కోసం చైనా- రష్యాలకు అనేక ఆచరణాత్మక సహకార అవసరాలు ఉన్నాయి. చైనా అధ్య‌క్షుడు, ర‌ష్యా అధ్య‌క్షుడు మ‌ధ్య కొన్ని కీల‌క ఒప్పందాలు కూడా చ‌ర్చ‌కు వ‌స్తాయి. అనంత‌రం ఒప్పందాల‌పై ఇరు దేశాలు సంత‌కాలు చేసే అవ‌కాశాలు ఉన్నాయి. పుతిన్‌ పర్యటనలో ఆ రెండు ప్ర‌భుత్వాలు ఒక‌రికొక‌రు స్పష్టంగా స‌హ‌క‌రించుకునే అజెండా ఉందని సూచిస్తోందని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. దీర్ఘకాలిక చమురు, గ్యాస్ సరఫరా, ఇంధన పరిష్కారం, మౌలిక సదుపాయాలు, రవాణా, ఓడరేవులు, ఆర్కిటిక్ మార్గాలు, యూరేషియన్ లాజిస్టిక్స్‌పై సహకారం వంటివి కీలక రంగాలపై చ‌ర్చ జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని స‌మాచారం. ఏరోస్పేస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఎకానమీ, చిప్ ప్రత్యామ్నాయం, తయారీ వంటి రంగాలలో హై-టెక్ పారిశ్రామిక సహకారంతో పాటు, వ్యవసాయ , ధాన్యం వాణిజ్యం, యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ మధ్య మరింత సమన్వయం కూడా దృష్టి సారించాల్సిన కీలక రంగాలుగా ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన మీడియా స‌మావేశంలో పుతిన్ త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డిస్తూ.. చైనా, రష్యాకు అతిపెద్ద వాణిజ్య, ఆర్థిక భాగస్వామి అని, అలాగే హై-టెక్ పరిశ్రమల ద్వారా ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు మెరుగుప‌డుతోందని పేర్కొన్నారు.

Leave a Reply