అమ్మ ఆలయం మరింత అభివృద్ధి చెందాలి..

అమ్మ ఆలయం మరింత అభివృద్ధి చెందాలి..

దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యుడు హరికృష్ణ..

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శీన నాయక్ కు పదవీ కాలం పొడిగింపు లభించడం ఆనందదాయకమైన విషయమని దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు హరికృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శీన నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దేవస్థానం అభివృద్ధి, పరిపాలనలో సమర్థత, భక్తులకు మెరుగైన సౌకర్యాలు, సేవల విస్తరణలో ఆయన చూపిన కృషికి గుర్తింపుగానే ఈ పదవీ పొడిగింపు లభించిందన్నారు.

గత కొంతకాలంగా ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు అందిస్తున్న సౌకర్యాల పెంపు, సేవా కార్యక్రమాల నిర్వహణలో ఈఓ శీన నాయక్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో దేవస్థానం పరిపాలన మరింత సమర్థవంతంగా కొనసాగుతోందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కూడా అమ్మవారి, స్వామివారి అనుగ్రహంతో శీన నాయక్ నాయకత్వంలో దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని, భక్తులకు మరిన్ని సేవా కార్యక్రమాలు అందుబాటులోకి రావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply