మహిళా భద్రత: పోలీసు శాఖదే మొదటి బాధ్యత

మహిళా భద్రత: పోలీసు శాఖదే మొదటి బాధ్యత

రక్షణలో అప్రమత్తత, స్పందనలో వేగం – పోలీసుల కర్తవ్యం
నిర్భయ వాతావరణం కల్పించడమే మా లక్ష్యం
సత్వర న్యాయం, మహిళలకు భరోసా – పోలీసు వాగ్దానం
సైబర్ నేరాల నుండి రోడ్డు భద్రత వరకు – 24/7 మహిళా రక్షణ

నందికొట్కూర్, ఆంధ్రప్రభ : మహిళలపై జరిగే వేధింపులు, హింస, సైబర్ నేరాలకు సంబంధించి కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టాలను సరళంగా వివరించారు.మహిళల రక్షణలో పోలీసు శాఖ పాత్ర, బాధ్యత అని నందికొట్కూరు రూలర్ సీఐ సుబ్రహ్మణ్యం అన్నారు శనివారం నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ ఉత్తర్వుల మేరకు, సమావేశాన్ని నందికొట్కూరులోని టీటీడీ కళ్యాణ లో మహిళల రక్షణ, భద్రత మరియు సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో నందికొట్కూరులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో నందికొట్కూరు టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ. శక్తి యాప్ యొక్క కార్యక్రమాన్ని ప్రజల చెంతకు చేరాలని లక్ష్యంతో ప్రధానమైన పొదుపు మహిళా సంఘాల సభ్యులు, పొదుపు లీడర్స్, అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ హెల్పర్స్, ఆశా వర్కర్లు అందరం కలిసికట్టుగా శక్తి యాప్ గురించి వివరించాలని లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు శక్తి యాప్, 1930 నంబర్‌పై మహిళల భద్రత కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి మొబైల్ యాప్ గురించి వివరించారు.

అత్యవసర పరిస్థితుల్లో 7993485111 నంబర్ ద్వారా తక్షణ సహాయం పొందవచ్చని తెలిపారు. మహిళలపై జరిగే వేధింపులు, హింస, సైబర్ నేరాలకు సంబంధించి కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టాలను సరళంగా వివరించారు.మహిళల రక్షణలో పోలీసు శాఖ పాత్ర, బాధ్యతలను వివరిస్తూ, ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. సైబర్ మోసాలు, ఆన్‌లైన్ వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులు వెంటనే 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని చించారు.కార్యక్రమం అనంతరం మహిళలు తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. మహిళల రక్షణ కోసం ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని పాల్గొన్నవారు కోరారు.ఈ సదస్సుకు నందికొట్కూరు టౌన్ ఎస్సై 2 సురేష్ మెప్మా అధికారిని ప్రమీలమ్మ, ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆశీర్వాదమ్మ, హెల్త్ సూపర్వైజర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

Leave a Reply