మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు కౌన్సిలర్‌ ప్రమాణ స్వీకారం

మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు కౌన్సిలర్‌ ప్రమాణ స్వీకారం

మక్తల్, ఆంధ్రప్రభ: మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు కౌన్సిలర్‌గా ఎరుకలి సత్యమ్మ శుక్రవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఫిబ్రవరి 10న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 6వ వార్డు బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన ఎరుకలి మహాదేవప్ప మృతితో ఎన్నిక వాయిదా పడింది. తిరిగి ఏప్రిల్ 18న నిర్వహించిన ఎన్నికలో ఎరుకలి మహాదేవప్ప సతీమణి ఎరుకలి సత్యమ్మ ఘన విజయం సాధించారు.

ప్రమాణ స్వీకార సభకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మున్సిపల్ కమిషనర్ రాజయ్య సత్యమ్మ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి శాలువాతో ఘనంగా సత్కరించారు.

మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి. రాజశేఖర్ రెడ్డి, బిజెపి కౌన్సిలర్లు పీకే నరసింహ, టప్ప కృష్ణ, మున్సిపల్ కమిషనర్ రాజయ్య, చైర్ పర్సన్ వాకిటి మానస హన్మంతు, వైస్ చైర్ పర్సన్ శైవి రెడ్డి తదితరులు శాలువాలతో అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు మరియు సిబ్బంది పాల్గొన్నార

Leave a Reply