సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బద్ధం రాంరెడ్డి మృతి

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బద్ధం రాంరెడ్డి మృతి

మోత్కూర్ , ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని పద్మశాలి కాలనీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బద్దం రాంరెడ్డి(80) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మధ్యాహ్నం తన నివాస గృహంలో మృతి చెందారు. కమ్యూనిస్టు పార్టీ లో కొనసాగిన రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి సింగిల్ విండో డైరెక్టర్ గా కూడా పనిచేశారు . రైతు కుటుంబంలో జన్మించిన రాంరెడ్డి నిత్యం ప్రజల మధ్య ఉంటూ కలగోల్పుగా ఉండేవారు. గత 5 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో బాధ పడుతూ ఆయన మృతి చెందారు. రాం రెడ్డి మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు స్థానిక ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు.పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రామచంద్రు,స్థానిక కాంగ్రెస్ నాయకులు పరామర్శించి రాంరెడ్డి భౌతిక ఖాయం పై కాంగ్రెస్ జెండా కప్పి తమ సానుభూతిని వ్యక్తం చేశారు.

Leave a Reply