బండి భగీరథ్ ను తక్షణం అరెస్టు చేయాలి

బండి భగీరథ్ ను తక్షణం అరెస్టు చేయాలి
మోత్కూర్, ఆంధ్రప్రభ:
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పై నమోదైన పొక్సో కేసులో తక్షణమే అరెస్టు చేసి, బాధితురాలికి నాయ్యం చేయాలని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మున్సిపల్ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ,, నిందుతుడిపై పోక్సో చట్టం క్రింద కేసు నమోదైనా ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం సరికాదని, వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించి, బాధితురాలికి న్యాయం చేయాలని ప్రభుత్వాని కోరారు.
బాధితురాలు కుటుంబసభ్యులు పిర్యాదు చేయడానికి వెళ్తే, పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందని, బాధితులను స్టేషన్లో నే ఉంచి ఆ సమాచారాన్ని నిందితులకు చేరవేశారని అన్నారు. నిందితులు కరీంనగర్ లోనే బాధితురాలిపై హాని ట్రాప్ కేసుపెట్టె వరకు పోలీసులు వేచిచూసి, ఆ తరువాతే ఫిర్యాదు స్వికరించడం చూస్తుంటే చట్టం పలుకుబడి గల వారికి చుట్టంగా మారిందనే అర్ధం అవుతుందన్నారు. భేటీ బచావ్ అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించ్చారు.
బీజేపీ నాయకుల నుంచే మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో దేశాన్ని కుదిపేసిన ఉత్తరప్రదేశ్ హత్రాస్ ఘటన, మల్లయోధులపై బీజేపీ ఎంపీ బ్రజ్ భూషణ్ సింగ్ కేసుల్లో బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే నిందుతులను కాపాడే ప్రయత్నం చేసిందో, ఇప్పుడు కూడ అదే దోరని కనిపిస్తుందన్నారు. బాధితురాలికి అండగా నిల్వవలసిన ప్రభుత్వం, పోలీసులు , నిందితులకు కొమ్ము కాయడం సరికాదని, ఇప్పటికైనా రాజకీయ వత్తిళ్లకు తలోగ్గకుండా నిందుతుణ్ణి వెంటనే అరెస్టు చేసి, బాధితురాలుకు రక్షణ కల్పించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు దడిపల్లి ప్రభాకర్, కురిమేటి యాదయ్య, దడిపల్లి సైదులు ఉన్నారు.
