గాయత్రీ విద్యా సంస్థల అధినేత గోపాలకృష్ణ మృతి

గాయత్రీ విద్యా సంస్థల అధినేత గోపాలకృష్ణ మృతి

పాయకాపురం, ఆంధ్రప్రభ : గాయత్రీ విద్యా సంస్థల అధినేత ఆకుల గోపాలకృష్ణ ఆకస్మిక మృతి చెందారు.ఈ సంఘటన తెలుసుకొన్న విద్యాసంస్థల ఉపాధ్యాయులు, విద్యార్థులు,పూర్వ విద్యార్థులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు గోపాలకృష్ణ మృతికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.సెంట్రల్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గురువారం ఏ. గోపాలకృష్ణ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కుటుంబ సభ్యులు స్కూల్ ప్రిన్సిపాల్ అభిలాష్కు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.గత కొంతకాలంగా గోపాలకృష్ణ అనారోగ్యం బారినపడి ఉన్నారు. ఐతే విద్యాసంస్థల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని పలువురు కొనియాడారు.

Leave a Reply